11, సెప్టెంబర్ 2024, బుధవారం

తొక్కలో jeetham

 నిన్న మధ్యానం లంచ్ కి ఇంటికి వచ్చినప్పుడు కాంపౌండ్ వాల్ గే ట్ విసురుగా వేసి లోపలికి వచ్చాక వరండాలో బూట్లు విసిరేసి ఇంట్లోకి రావటం చూసి మా ఆవిడ “జీతం వచ్చినట్లుంది ?” అంది.

బాడీ లాంగ్వేజ్ డీకోడింగ్ లో గుండమ్మలని తట్టే వాళ్ళు లేరు.
బోజనం చేసి ఒక చిన్న కునుకు తీసి మళ్ళీ ఆఫీస్ కి రెడీ అవుతూ తను రెస్ట్ తీసుకోకుండా సోఫా లో కూర్చుని ధీర్ఘo గా ఆలోచలో ఉండటాన్ని గమనించి .. "ఏమయింది "అన్నాను.
‘ఆన్లైన్ లో ఒక శారీ చూశాను. బావుంది. నీకు వాట్స్ అప్ చేశాను’ అంది.
అప్పటికే నేను చూసేశాను. మెదడు ఈ మద్య అయిదు అంకెలని ఇముడ్చుకోలేక పోతుంది.
‘చీర .. సూపర్ కదా ? ‘ అంది
హోటలో మెనూ కుడివైపు చూడటం డీఫాల్ట్ గా అలవాటు అయిన వాడిని.
ఇప్పుడు సంభాషణ పొడిగించడం జాతీయ విపత్తు ..
“నాకు ఇక నిద్ర పట్టదు” అంది మృదువుగా .. తక్కువ లైటింగ్ లో ఫోర్క్ తో స్టార్టర్ గుచ్చుతూ కళ్ళలోకి చూసి మాట్లాడినట్లు..
ఇక తప్పెట్టు లేదు.
‘సరే ఏదోక ఏర్పాటు చేస్తాను’
గ్లాసు తో మజ్జిగ ఇచ్చింది. నిమ్మకాయ పిండి కోతిమీర కోటింగ్ తో
**
సాయంత్రం గేటు శబ్దం రాకుండా వేసి. పద్దతిగా షూ విప్పి లోపలికి వస్తూ ఉంటే
“తొక్క లో జీతం, నా కూతురు జీతం లో ముప్పాతిక, నా కొడుకు జీతం లో పాతిక .. ఇంతోటి దానికి కారు దానికో డ్రైవరు బిల్డ్ అప్పూ “
నాకు వినబడాలనే గొణుగుతుంది.
‘టీ’ రావటానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని గ్రహిస్తూ లోపలికి వస్తుంటే హల్లో టీ పాయ్ మీద 'కీర్తి మెడికల్స్ వాళ్ళు హోమ్ డెలివరీ చేసిన స్లీపింగ్ పిల్స్' కనిపించాయి.

it's a boy

 Its a boy .. it’s a boy

కన్నీళ్లతో గది బయటకి పరిగెత్తాడు సుబ్బారావ్
..
..
..
..
అదే చివరి సారి
ఇంకెప్పుడూ తాయిలాండ్ వెళ్ళలేదు

9, ఆగస్టు 2015, ఆదివారం

మన్మధరావు

ఆమె కి అతను పాతికేళ్ళ తర్వాత తారస పడ్డాడు ..
అప్పట్లో ఎంత రొమాంటిక్ గా ఉండేవాడు ?.
చూపులతో గుచ్చేవాడు ..
కొంచెం చాటు దొరికినా సరే .
అతని చెయ్యి ఖాళీగా ఎప్పుడూ ఉండేది కాదు ..
..
అనుకోకుండా సెర్చ్ బార్ లో అతని పేరు టైపు చేసింది.
మ న్మ ద రా వు .....
అతనే... అతనే ..
ఆమెకి పాత రోజులు గుర్తొచ్చాయి
.
ఇన్బాక్స్ లో మెస్సేజ్ ఉంచింది
మధు నువ్వేనా ?
అటునుండి వెంటనే సమాదానం . ఒక ఆశ్చర్యం బొమ్మ
"ఎలా ఉన్నావు ?" ఈమె .
..
బా ....గ ....నే .....ఉ ....న్నా ...ను .
..
ఏమిటి అంత స్లో గా టైపు చేస్తున్నావు ?'
..
" ఒక్క .. చేత్తో .. ఇంత కంటే.. వేగం .. కష్టం tongue emoticon tongue emoticon pacman emoticon pacman emoticon pacman emoticon
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
నువ్వింకా ఆ పాడు సిగిరెట్లు మానలేదా?

11, జులై 2015, శనివారం

ఛాతీ భారంగా ఉంటుంది.

సాయంత్రం .. విజిటింగ్ అవర్స్ లో ..ఒక వ్యక్తి వచ్చాడు డాక్టర్ గారి వద్దకి.
'
మధ్య వయస్కుడు సగటు ఉద్యోగి లాగా ఉన్నాడు.
'
" డాక్టర్ గారు నా ఛాతీ ఎడమవైపు భారంగా ఉంటున్నదండి ఈమధ్య.. ఏదో బరువుగా ..లాగు తున్నట్లుగా."
'
ఓ‌పి రూమ్ లో ఉన్న వైయింగ్ మెషిన్ మీద నిలబడమని
BMI చూశారాయన. ప్రమాదకర పరిస్తితి ఏమి లేదు..
.
" ఆల్కాహల్, స్మోకింగ్, లాటివి అలవాటు ఉన్నాయా?
'
"స్మోకింగ్ లేదు సార్. సంవత్స రం మొత్తం లో ఒకసారి...
పెళ్లి రోజు మాతమే తాగుతాను అది 60 ఎం‌ఎల్.. బాదతో "..
'
ఇద్దరు నవ్వుకున్నాక గదిలో వాతావరణం ఆహ్లాదంగా మారింది .
'
"రోజంతా అలాగే ఉంటుందా?"
'
"లేదండీ .. ఎక్కువగా పగటి పుట అనిపిస్తుంటుంది.
రాత్రి ఇంటివద్ద నేనెప్పుడు అలా ఫీల్ అవలేదు "..
.
"మామూలు గా అయితే, ecg, ట్రెడ్మిల్, నాలుగు అంకెల బిల్లు వేయాలి మీకు..
కానీ ఇవేమీ లేకుండా చెప్పాలంటే
.
ఆ ఆరు అంగుళాల చాట సెల్ ,
కాగితాలు, కరెంటు బిల్లులు, వక్కపొడి పోట్లాలు
చెత్త అంతా ఆ జేబులో పెట్టటం మానెయ్యండి.
అంతా నార్మల్ గా ఉంటుంది." డాక్టర్ గారు కూడా నవ్వుతూ చెప్పారు.

5, జులై 2015, ఆదివారం

డైమండ్ నక్లెస్

తల్లి తండ్రుల ముందు బర్త తన మాట ఇప్పటికీ జమదాట డని 
నిరూపించదలుచుకుంది కవిత.
రాత్రి పొద్దు పోయాక వచ్చిన వాళ్ళముందు శ్యామ్ గురించి బీరాలు పోయింది.
సంతోషం వెలిబుచ్చింది తల్లి.
ఈల పాట అందుకున్నాడు తండ్రి
పొద్దుటే కాఫీ తాగి ఇప్పుడే వస్తాను అని చెప్పి
వెళ్ళిన మనిషి .బోజనం టైమ్ అయినా పత్తా లేడు.
ఎక్కడున్నారు? ఫోన్ లో గట్టిగా అడిగింది.
" కవితా.. నీకు గుర్తుందా నాలుగేళ్ల క్రితం కీర్తిలాల్ డైమండ్స్ లో
ఒక డైమండ్ నక్లెస్ సెట్ చూసి బాగా ఇష్ట పడ్డావు ?
అప్పట్లో నా దగ్గర అంత డబ్బు లోక పోయింది...?"
కవిత కి ఇప్పటికీ గుర్తే ..కెంపులు, వైడూర్యాలు, కాంబినేషన్ తో కట్ డైమండ్ పీస్.
నగ అలంకరించుకుని అద్దంలో చూసుకుంటే ..
అదేదో రాజమౌళి చిత్రం లోని రాకుమారి లాగా?..
"శ్యామ్..."ప్రేమతో పిలిచింది ఆవిడ ..
పిల్లలు గమనిస్తున్నా గొంతులోని ప్రేమని ఆపలేక పోయింది.
"ఏదో ఒకరోజు అది నీదవుతుంది అని చెప్పాను ..గుర్తుందా?"
కవిత బుగ్గలు ఎర్రబడ్డాయి. తను బర్తని ఒంటరిగా ఉన్నప్పుడూ వాడే
పేరుతో పిలుస్తూ" te amo" అంది స్ప్యానిష్ లో పిల్లలకి అర్ధం కాకుండా.
...
ఒక్క నిమిషం మౌనం . రెండు వైపుల నుండి .
"సరిగ్గా ఆ షాపు కి పక్కనే ఉన్న బార్లో ఉన్నాను .
పాత ఫ్రెండ్ ఒకడు కలిశాడు .లాస్ట్ పెగ్గు .. వచ్చేస్తున్నా బోజనానికి "
పోను కట్ చేశాడు శ్యామ సుందరం.

29, జూన్ 2015, సోమవారం

అత్తగారు అభిమానం

రెండురోజుల ట్రిప్ కి అన్నీ సిద్దం చేసుకున్నాక 
ముందుగా మాట్లాడు కున్న కారు ఫ్లాట్ వద్దకి వచ్చింది.
వాచ్ మెన్ సాయంతో లాగేజీ సర్దుకున్నాక .
ఫ్లాట్ లాక్ చెయ్యబోతుంటే .. గండుపిల్లి ఒకటి ఫ్లాట్ లో దూరింది. 
'అక్వేరియమ్ లోని చాపల్ని తినేస్తుందేమో' అంది ఆవిడ కంగారుగా 
"నువ్వేల్లి కార్లో కూర్చో నేను దాన్ని తరిమి వస్తాను" చెప్పడతాను .
సెల్లార్ లో వాచ్ మెన్ కి జాగర్తలు చెప్పిన ఆవిడ వచ్చి కార్లో కూర్చుంది.
లాగేజీ ఒక్కసారి చెక్ చేసుకుంది. సారువాడు పదినిమిషాలయినా రాలేదు.
ఇంట్లో ఎవరు లేని విషయం కొత్త వ్యక్తికి తెలియకూడదని.
" ఆయన అత్తగారు మందులు ఎలా వాడాలో చెబుతున్నట్టున్నారు.
ఆవిడంటే మహా అభిమానం " డ్రైవర్ తో అంది ..
మరో అయిదు నిమిషాలకి ఆయన వచ్చాడు.
కారెక్కి "పోనీ" అని .
లమ్దీ ముండ.. డోరు కర్టెను వెనుక దాక్కుంది .
కర్రతో రెండు పీకి దుప్పట్లో చుట్టి పోర్చ్ నుండి కిందవేశాను "..
ఆలస్యానికి సంజాయిషీ చెప్పడతాను
...
వీది మలుపులో కారు ఆపిన డ్రైవరు.
" సార్ మీ ఫోటో ఒకటి నాకివ్వండి సార్ ..
మా ఇంట్లో గోడకి తగిలించుకుంటాను" తడి కళ్ళతో చెప్పాడు . tongue emoticon tongue emoticon

21, జూన్ 2015, ఆదివారం

robot

నిన్న వరుసగా జోకులు పోస్ట్ చేస్తుంటే ..
are you a robot ?
అని ప్రశ్న వచ్చింది.  అవును అనే ఆప్షన్ కనిపించలేదు :(

Please prove you're not a robot

Because you've made a large number of posts today, please prove that you are not a robot by clicking the following checkbox. Learn more