11, సెప్టెంబర్ 2024, బుధవారం

తొక్కలో jeetham

 నిన్న మధ్యానం లంచ్ కి ఇంటికి వచ్చినప్పుడు కాంపౌండ్ వాల్ గే ట్ విసురుగా వేసి లోపలికి వచ్చాక వరండాలో బూట్లు విసిరేసి ఇంట్లోకి రావటం చూసి మా ఆవిడ “జీతం వచ్చినట్లుంది ?” అంది.

బాడీ లాంగ్వేజ్ డీకోడింగ్ లో గుండమ్మలని తట్టే వాళ్ళు లేరు.
బోజనం చేసి ఒక చిన్న కునుకు తీసి మళ్ళీ ఆఫీస్ కి రెడీ అవుతూ తను రెస్ట్ తీసుకోకుండా సోఫా లో కూర్చుని ధీర్ఘo గా ఆలోచలో ఉండటాన్ని గమనించి .. "ఏమయింది "అన్నాను.
‘ఆన్లైన్ లో ఒక శారీ చూశాను. బావుంది. నీకు వాట్స్ అప్ చేశాను’ అంది.
అప్పటికే నేను చూసేశాను. మెదడు ఈ మద్య అయిదు అంకెలని ఇముడ్చుకోలేక పోతుంది.
‘చీర .. సూపర్ కదా ? ‘ అంది
హోటలో మెనూ కుడివైపు చూడటం డీఫాల్ట్ గా అలవాటు అయిన వాడిని.
ఇప్పుడు సంభాషణ పొడిగించడం జాతీయ విపత్తు ..
“నాకు ఇక నిద్ర పట్టదు” అంది మృదువుగా .. తక్కువ లైటింగ్ లో ఫోర్క్ తో స్టార్టర్ గుచ్చుతూ కళ్ళలోకి చూసి మాట్లాడినట్లు..
ఇక తప్పెట్టు లేదు.
‘సరే ఏదోక ఏర్పాటు చేస్తాను’
గ్లాసు తో మజ్జిగ ఇచ్చింది. నిమ్మకాయ పిండి కోతిమీర కోటింగ్ తో
**
సాయంత్రం గేటు శబ్దం రాకుండా వేసి. పద్దతిగా షూ విప్పి లోపలికి వస్తూ ఉంటే
“తొక్క లో జీతం, నా కూతురు జీతం లో ముప్పాతిక, నా కొడుకు జీతం లో పాతిక .. ఇంతోటి దానికి కారు దానికో డ్రైవరు బిల్డ్ అప్పూ “
నాకు వినబడాలనే గొణుగుతుంది.
‘టీ’ రావటానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని గ్రహిస్తూ లోపలికి వస్తుంటే హల్లో టీ పాయ్ మీద 'కీర్తి మెడికల్స్ వాళ్ళు హోమ్ డెలివరీ చేసిన స్లీపింగ్ పిల్స్' కనిపించాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి