20, జూన్ 2015, శనివారం

తండ్రి ఎవరు ?

ఒక సారి మా పిల్లలకి బాగా లేనప్పుడు
సుధాకర్ రెడ్డి గార ని ఒక పిడియాట్రీస్ట్ వద్దకు చెక్ అప్ కి వెళ్ళాం.
.
ఓపిగ్గా వింటారు .. వివరంగా చెబుతారు .. 
ఏ మందు ఎలా వాడాలో చెప్పాక కానీ పంపరు.
.
అంత కమిట్మెంట్ ఉన్న డాక్టరు గారిని చూశాక
నాకు ఆయన పట్ల చాలా గౌరవం కలిగింది.
.
" సర్ ఒక్క నిమిషం ఆఫ్ థి రికార్డ్స్ మాట్లాడనా?" అడిగాను నేను.
.
."చెప్పండి" అన్నారు ఆయన.
.
"మీ రూము బయట నేమ్ బోర్డ్ కొంచెం మార్చండి.
చిన్న పిల్లలు అప్పుడప్పుడే స్కూల్ లో అన్నీ చదవటం నేర్చుకుంటున్నారు.
తల్లులని ఎంబరాస్ చేస్తున్నారు." అన్నాను నేను.
.
"ఏమయినా తప్పుగా ఉందా అందులో " కంగారు పడ్డాడు ఆయన
.
"ఒక్క సారి మీరు బయటకి వస్తారా? "
.
వెంటనే నాతో బయటకొచ్చాడు ఆయన.
.
అక్కడ బోర్డ్ మీద ఇలా ఉంది.
.
డా. డి . సుధాకర రెడ్డి,
చిన్న పిల్లల వైద్య నిపుణులు.
వీలయితే డా. సుధాకర రెడ్డి , డి అని మార్పించండి.smile emoticon grin emoticon నవ్వాను నేను
(మా స్నేహం ప్రారంభం అయ్యింది.)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి