20, జూన్ 2015, శనివారం

సిగిరెట్లు మానండి

సిగిరెట్లు మానాలని గట్టి నిర్ణయం తో వచ్చాడు కొలికపూడి .
రోజుకెన్ని తాగుతారు ? డాక్టర్ ప్రశ్న.
ఏడెనిమిది? సమాదానం.
"చూడండి .. .మనమెప్పుడు సాధించలేని పెద్ద టార్గెట్స్ పెట్టుకోకూడదు.
ఒక్కసారిగా పుర్హ్తిగా మానేయటం కస్టమ్."
"కొన్నాళ్లు బోజనమ్ చేశాక ఒకటి కాల్చాండి .రాను రాను తగ్గిద్దాము." డాక్టర్ గారు సలహా చెప్పారు.
మళ్ళీ రెండు నెలలకి డాక్టర్ దగ్గరకి వచ్చాడు కొలికపూడి.
గుర్తు పట్టని డాక్టర్ కి గుర్తు చేసుకుంటూ చెప్పాడు." సార్ రోజుకి ఎనిమిది సార్లు బోజనమ్ చేయటం చాలా కష్టం గా ఉంది సార్." ఆయాసం తో ఊపిరి పీల్చుకున్నాడు మిత్రుడు రవి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి